Friday, 30 October 2020

// నీ కోసం 193 //

మౌనమో ఏకాగ్రత..అదో ధ్యానస్థితి లిపిలేని నిరంతర భాషణ ఆత్మవిచారపు తపస్సు అదో విశ్వభాష అఖండ ధార్మిక దివ్య ప్రక్షాళన అతీతమైన మౌనం జ్ఞానానుగ్రహం.. సనాతన ఏకాగ్రత, విషయ శూన్యావస్థ మహార్ణవమగు మౌనం మానసిక నియంత్రణ..ఇంద్రియ వైరాగ్యం.. తద్వారా ఆత్మసాక్షాత్కారము అందుక మౌనమో విశిష్ట తత్వం అనివార్య మౌనం అత్యుత్తమమూ, అర్ధవంతమూ.. అయితే అభిమానాన్ని కించపరిచే మౌనం మాత్రం మృత్యుసమానం 😣

No comments:

Post a Comment