Friday, 30 October 2020

// నీ కోసం 189 //

నీ ధ్యానసముద్రంలో మునిగి మత్తుగా ఈదులాడుతున్నప్పుడంతా అలల నవ్వులో తేలించి ఆడిస్తావు కాలమాపిన కీకారణ్యంలో.. ఆర్తికని ఆరాటపడ్డ వేళ నా ఉనికి సర్వం నువ్వేనంటూ లోలోపల తొలకరివై కురుస్తావు క్షణానికోలా మారే నా ముఖచిత్రాన్ని చూపుకొసలతో సవరిస్తూ మల్లెపొదల పులకింతలు అంటుకడతావు ఓపలేని తమకమంటూనే.. నువ్వెందుకలా మౌనానికి శ్రీకారమయ్యావ్ ప్రేమాన్వీ నిట్టూర్పులతో జ్వలించవద్దలా అరచేతి భావుకతలో కలకాలం నిన్ను నేను రవళిస్తా..💕💜

No comments:

Post a Comment