Wednesday, 7 October 2020

// నీ కోసం 182 //

ఎప్పుడూ యుద్ధమే నాతో నాకు ఎందుకంటే ఎలా చెప్పనూ Sense of Isolation.. మనస్సావరణంలో ఏవో అడుగుల చప్పుళ్ళు అప్పుడే శూన్యం..అందులోనే ఓ స్వరం ఏమో..నాకోసం పాడుతున్నదెవరో తళుక్కుమన్న ఆనంద తారకలు కన్నుల్లో సామగాన సుమరాగాలు పెదవుల్లో చిరుగాలి సవ్వడంతా ఊయలూగుతున్నట్టు ఎదలో ఎన్నెన్ని భావతరంగాలు శబ్దిస్తున్నా అనువదించేందుకు భాష సరిపోని మౌనద్వీపంలో నన్నుంచుతూ ఏం కలలో..మధువీక్షణల లయలో అల్లుకున్నది అక్షరాలనే అయినా ఆవిష్కరిస్తుంది ఒక అపురూప అనుబంధమన్నట్టు 💕💜

No comments:

Post a Comment