Friday, 30 October 2020

// నీ కోసం 192 //

ప్రకృతి సమాహారంలో చిరుగాలి సవ్వడించినట్టు నిదుర మరచిన రాత్రి గుండెల్లో నీ రూపు నాకు విరామ దీపారాధనమైంది అనుభూతుల ఆస్వాదనం నేర్చి కలలో మత్తుగా జోగుతున్న విరజాజులు కొత్తగా ఏ ఊహలమాలను అల్లుకున్నాయో కుంకుమ కలిసి రాగరంజితమైనట్టు నా మనసాంబరపు ఎరుపు బుగ్గల్లో ఒదిగిన పన్నీటి పువ్వయ్యింది నీ చూపు నన్ను స్పర్శించిన క్షణాల్లో మొదలైన తీపి మైమరపు నా పెదవుల నవ్వుని అదిమిపెట్టిందంటే ఏమంటావో చేరువకాలేని దూరాలు చెరిపిన చీకటి చిలిపిదనమేంటో నిశ్శబ్దం మృదువుగా మోగిన మువ్వయ్యింది ఈరేయి అమాసని కాదని పున్నమి విరిసింది 😊💜

No comments:

Post a Comment