Wednesday, 7 October 2020

// నీ కోసం 187 //

నాకు నేను ఆకుచాటు రహస్యమై వేడెక్కిన తలపున విశ్రమించినందుకు పిల్ల తెమ్మెర కవ్వించింది కాలాన్ని కలహించి నిన్ను పొదుపుకున్న కనురెప్పల కూనిరాగం వల్లమాలిన ప్రేమను కురిసింది అత్తరు పూసుకున్న క్షణాల ఆనందం ముత్యాలసరాల మాదిరి సుతిమెత్తని భావమై ఒదిగింది వేళ్ళకు మొలిచిన కొమ్మల్లో అక్షరాలు చిగురించి ఎన్నెన్ని ఊహలు పరిమళించాయో.. మేఘాలతో కలిసి ప్రవహించిన కల నిన్నటికి కొనసాగింపుగా ఈరోజు కవితై కాగితాన్ని తడిమింది..💜💕

No comments:

Post a Comment