Wednesday, 7 October 2020

// నీ కోసం 180 //

వినీలాకాశంలోని చందమామ తునక రవ్వంత నవ్వులు పొంగని మొహాన్ని అమృతాన్ని కురిపించడమాపి మరీ చూస్తుంది ఈ మసక చీకటి చల్లగా తగిలినప్పుడు మనసుకి తెలిసిన మంత్రమొక్కటీ బహువిధాలుగా మారి ఏదో రహస్యాన్ని ఆరాతీస్తుంది గుండెగొంతుకలో ఆగిపోయిన కవ్వింత ఏదో మౌనపోరాటాన్ని సూచిస్తున్న నిశ్శబ్దమనిపిస్తుంది మూసిన తలపులమాటు పరిమళ సొద, నీ విరహమను కొసమెరుపు గుసగుసలదనుకుంటా ఏమో ఈ ఎదలో దరహాసం ఏకాంతంలోనూ లయమవ్వనివ్వని మేలిముసుగేసుకున్న వలపు రహస్యం 😣

No comments:

Post a Comment