Saturday, 31 October 2020

// నీ కోసం 201 //

వానకారు కోయిల ప్రమోదపుగీతం శ్రావణ మాసాంతరపు సుధావృష్టి సంకేతం నడిరేయి చినుకుసవ్వడి సంగీతం నవరాగపు సమ్మోహన మధుపగానం రంగు రంగు కలల్లో విహరిస్తున్న మనోరథం పాలసంద్రమై పొంగుతున్న అంతరంగం చల్లారని కౌగిలిలో నులివెచ్చదనం మల్లెపందిరి చాటు మోహనరాగం యుగాలుగా తపిస్తున్న పూల కలవరం అయ్యేదెన్నడో బృందావనం ఏకాంతం పల్లవించు మౌనవిషాదం నిట్టూర్పులు పరిమళిస్తున్న నీరాజనం 💜💕

No comments:

Post a Comment