Wednesday, 7 October 2020

// నీ కోసం 177 //

నాలో ప్రాణశక్తి అలలా ఒంపులు తిరుగుతూ ఆనందాన్ని అభినయిస్తుందంటే ఏ కొసమెరుపు తాదాత్మ్యాన్ని అనుభవిస్తుందో నీ సాహిత్యాన్ని స్వరార్చన చేస్తున్న కలవరింతలు.. తెలుసా..గుప్పెడు గుండె గగనమై.. కోట్లాది తారలు వెలుగుతున్న తేజస్సిది.. "చందమామ ఆకాశంలో అందగించాడూ".. ఆహా..కళ్ళు నులుముకుంటేనే కలలైతే నిద్రెందుకు ఈరేయి అసలు పెదవిప్పకుండా నవ్వడమెక్కడ నేర్చావో జలతారు తెరలమాటు వెన్నెలలా ఆ చిరునగవుదెంత అందమైన మౌనప్రవాహమో నాలో నవరాగ వర్ణాలు వివర్ణమైనప్పుడే అనుకున్నా అచలమైన నీ ఆత్మ..ప్రేమరంగుదయి ఉంటుందని.. ఓ నాదవినోదపు కోయిలా.. నీ అంతరంగాన్ని వినాలనుంది పున్నమి పాటయ్యేలా శబ్దించు మరి..💕💜

No comments:

Post a Comment