Wednesday, 7 October 2020

// నీ కోసం 184 //

ముగింపులేని మనోతపస్సు మౌనాన్ని తలదాల్చి ఆర్తనాదాన్ని గొంతులోనే ఆపింది చెరుపుకోవడం రాని కన్నీటిచారిక మరణసదృస్యమైన శూన్యానికి దారితీసి విషాదాన్నే పొలమార్చుతుంది వేసవి గాలుల తాకిడికి నిశ్శబ్దంగా దాచుకున్న పరిమళం పూలను వీడి పరిసరాలను నింపింది ఎవరో తెరిచిన కిటికీవల్ల నాలో కొంత తాజాదనం ఏకాంతంలోకి అడివిని తెచ్చింది కొన్ని నవ్వులైనా పూయాలిప్పుడు నాలోపలి తగువు ముగిసి ఒక్క ఊహనైనా పిలవాలంటే..😊

No comments:

Post a Comment