Saturday, 30 January 2021

// నీ కోసం 278 //

అప్పుడే సాయింత్రమైపోయింది నన్ను మధురాక్షరాలతో పలకరించినట్టే కనిపించి అప్పుడనగా మాయమయ్యావ్ నువ్వు మళ్ళీ పిలుస్తావని మూసుకుపోతున్న కళ్ళను మభ్యపెట్టి తడిపెదవుల్లో కొన్ని మాటలు దాచుంచాను అప్పటిదాకా ఆర్ణవమై అంతలోనే అలలా అంతర్ధానమై అపరిచితమయ్యే అల్లరెక్కడ నేర్చావో నీ నిరీక్షణ మధ్యలో నా మౌనం సగం సగం నవ్వుతూ నిశ్శబ్దాన్ని తర్జుమా చేయమన్నది తెలుసా పూర్తికాని కవనంలో పరిమళపుష్పాల్లా నీ తలపుముత్యాలు ఏరుకుంటూ పొద్దు గుంకింది చూడు పదాలు వాడిపోయేలోగా ఈపూటయినా నన్నాలకిస్తావో లేదో మరి లేదంటే అలవాటయిన శూన్యం ఉండనే ఉందిగా 😔😒

No comments:

Post a Comment