Saturday, 30 January 2021

// నీ కోసం 273 //

నీ విరహం నిశ్శబ్దంగా నవ్వినప్పుడు రాలిన పారిజాతాల మువ్వల సవ్వడికి నాలో ప్రేమ నులివెచ్చని దుప్పటి కప్పుకుంది నీ మౌనమందించిన ప్రేరణకే మనసు నిశ్చలమై.. నా నరనరాల్లోని ఆలాపన సంచలనాన్ని సాంత్వన పరిచే అతీతానుభవమనుకుంటే.. తపించిన నా తలపుల నిర్మోహం నిన్ను అలౌకికం చేసిందని నిరూపణగా ఆ తడికళ్ళ స్పందన చాలు.. మన అవిశ్రాంతపు జీవితప్రయాణంలో రససిద్ధి పొందే క్షణాల సుతారం తుదీ మొదలూ అక్కర్లేని వృత్తం నాకు తీరమంటూ లేని సంద్రంలా ప్రేమకు ప్రేమే సంకల్పం నిరీక్షణను అంతంచేసే నిరంతర దీప్తివంతం 

No comments:

Post a Comment