Saturday, 30 January 2021

// నీ కోసం 275 //

ఎదురుచూడని సాయంకాలం ఎదలోకి నీ ఆగమనం.. జివ్వుమని వీస్తున్న చలిగాలికి మబ్బు పట్టిన కళ్ళలో నిదురనే కలగంటున్న మత్తు తరుముతున్న నీ విరహం నన్ను సవరించే మురిపెం.. గులాబీరంగు సిగ్గువిడిచి పచ్చనైనట్టు మౌనం గిలిగింతల చందనమై బుగ్గలకు నెమలీకలు రాసినప్పటి నవ్వు గాఢమైన నిశ్శబ్దక్షణాల్లో సున్నితమైన నీ తలపు వ్యాపకం.. ఊహల నైరూప్యంలో నేనున్నప్పుడు సుషుప్తి వీడితే తపస్సు చెదిరి మనసు నొచ్చుకుంటున్న వైనం చూపు కలపని బెంగల్నీ ముద్దుచేసే రెప్పలు కదా నీవి.. ఇమిడిపోయానందుకే, హృదయం బరువెక్కినపుడల్లా ఒకరికొకరం తోడవ్వొచ్చనే 💜😂

No comments:

Post a Comment