Saturday, 30 January 2021

// నీ కోసం 250 //

హృదయం తప్పిపోయిన ఏకాంతంలో శరత్పున్నమి జాబిలి పగలే విచ్చేసిన రోజు వలసపోయిన ప్రాణాన్ని ఎక్కడని వెతకాలో మరి.. ఎన్ని రాగాల పరిమళాలు జోలపాడినా ఈ రేయి నిదురన్నది వచ్చేట్టు లేదు.. వెన్నెల్లో తడుస్తున్న ఆకులకూ నాలాగే ఊపిరాడనట్టుందేమో స్వగతంలో పాడుతూ.. తడబడుతూ కొన్ని క్షణాల రెపరెపలు..పూలగంధం పూసినట్టు ఇక్కడేవో పన్నీటి మరకలు మూసిన రెప్పల వెనుక వెచ్చదనం పెదవికేం తీపినద్దిందో, దూరాన్ని తలచొద్దని చల్లగాలి గుసగుసలోపక్క Hmm.. చానాళ్ళకి కురుస్తుందిగా జలపాతం తలపులతో సంగమిస్తానంటే కాదనేదేముందిలే..💜💕

No comments:

Post a Comment