Saturday, 30 January 2021

// నీ కోసం 269 //

పగలంతా పని చేసుకోనివ్వక నావెనుకే ఉండి విప్పార్చుకుని మరీ కనుపాపల్లోకి చూస్తూ ఉంటావ్ కదా నిశ్శబ్దంగా నన్ను చదివి నీకోసం రాసుకున్నట్టు ఒక విరహగీతాన్ని రాసుకుని నాకొదిలేసి.. ఇద్దరికీ చెరిసగమంటావు రాత్రంతా వెన్నెల్లో విహరించినప్పుడు అలవాటైన నీ గుండెచప్పుడు వింటూ రెక్కల్లేకుండానే ఎగరగలనని తెలిసిపోయింది ఆకులన్నీ గాలికి ఊగి రాలిపోతూ ఏదో రహస్యాన్ని చెప్పి మౌనంగా ఋతువుకి లొంగిపోవడం చూసాక.. ఈ కార్తీకదీపాల వెలుగులో నీకోసమూ ఓ వాక్యం రాయాలనుకున్నాను Ur Heart is a "feeling" to me n Ur silence itself is d words to my Melody 🎶💜

No comments:

Post a Comment