Saturday, 30 January 2021

// నీ కోసం 249 //

Heart beat..Heart beat.. Speeding up.. మౌనంగా పులకిస్తున్న కళ్ళు ముత్యాలై రాలితే కదంతొక్కుతూ క్షణానికో నవ్వు రంగు రంగు పువ్వులు పూయిస్తున్నట్టుంది.. మనసు దాచుకున్న మాటల అందం మంచు వర్షానికి సమానమేమో వెన్నులో వెచ్చని ప్రవాహం మెలికలు తిరుగుతూ కదులుతున్నట్లుంది రాగాల గొంతులో అనురాగరసం పొంగినప్పుడల్లా గుండె పొలమారి స్వరమాగుతుందంటే పంచమాన్ని అనుసరిస్తున్న నువ్వు గమ్యంలో నన్ను కలుస్తున్నట్లుంది నిజంగా.. మదిలోకి సముద్రమెప్పుడు చేరిందో తెలీనేలేదు ఈ కెరటాల సవ్వడి మాత్రం నన్నూయలూపుతూంది..💜💕

No comments:

Post a Comment