Saturday, 30 January 2021

// నీ కోసం 266 //

నిద్దురను వెలేసిన చీకటివేళ మనసుకి రెక్కలొచ్చినట్టు నేనో విహంగమై ఊహల సరిహద్దుల్లో ఎగురుతుంటాను సగం సగం నవ్వుతున్న పెదవుల్లో పలరింపులున్నాయో లేవో వెతికేలోపే అలసిపోయిన నేను అస్తిత్వాన్నీ కోల్పోతాను దూరాల్ని దగ్గర చేస్తున్న మాయ ఒక్క మాటలోనే ఓదార్చి పోయాక నాకు నేనో ఆప్తవాక్యం రాసుకుంటాను నిరంతరంగా ప్రవహించాలంటే రోజూ వాన కురవనవసరం లేదని లోలోని అనుభూతి తడిగా పరిమళిస్తుంది పదాలతో పనిలేని మౌనం చేపట్టిన క్షణాలను నెమరేస్తున్నప్పుడు వేకువ కోసం తొందరేదీ లేదనిపిస్తుంది 🌸

No comments:

Post a Comment