Saturday, 30 January 2021

// నీ కోసం 248 //

కలల కోసం కాచుకున్నట్టుంది నా పని రేయయినా నిదుర జాడలేని ఏకాంతంలో.. లెక్కించేందుకు చుక్కలు కరువైన ఆకాశం శూన్యాన్ని పెనుగులాడుతున్న సమయం నువ్వనని మాటలు కడవలకొద్దీ వాన చినుకులై కన్నుల్లో తడి గుబుళ్ళు కురిసింది కాక కవిత్వం మీద బెంగపడ్డ కాగితాలన్నింటినీ పడవలుగా మార్చేస్తుంది .. రవ్వంత తీపి మైమరపు అంచుల్లో కలవరం తరంగమై కళతప్పిన నిశీధిని మోయలేని విషాదం నాకసలే పరిచయంలేని మౌనమై చిరునవ్వుని మాయం చేసేస్తుంది సుదూరపు మబ్బుల్లో ఆగి ఆగి మెరుస్తున్న విద్యుల్లత మాత్రమే నన్ను పలకరిస్తున్న సవ్వడిగా ఇదొకటే మదికి పరమానందమై జ్ఞాపకాల నెమరువేతలో మానసిక తపనలు కలబోస్తుంది 😒

No comments:

Post a Comment