Saturday, 30 January 2021

// నీ కోసం 257 //

పరిసరాలన్నీ నిశ్శబ్దంగా పరిమళించడం హృదయంలో నువ్వు చేసిన కావ్యగానపు పంక్తులదేనా అలసిపోని తలపులతో పులకరించే నువ్వు నిజంగా నీలిమబ్బులను దాటే విహారానికి నన్ను పిలిచావా మరైతే నా మందస్మిత మధురిమని కాస్త సరిచూసుకోనివ్వు కొన్ని మువ్వలూ..కొన్ని అలలు వెంటేసుకొస్తే నీకూ ఇష్టమేగా అయితే నీ అల్లరి రాసేందుకు నాకు అనుమతినివ్వాలి క్షణక్షణం ఆసువుగా పుట్టుకొచ్చే పాటలన్నీ మనం పాడుకోవాలి సరేనంటే పదపోదాం.. పల్లకీనో..పడవ కారునో సిద్ధం చెయ్యి మరి..😉😍

No comments:

Post a Comment