Saturday, 30 January 2021

// నీ కోసం 268 //

అన్నీ అమర్చుకుని పుట్టడమంటే కొంత ఐశ్వర్యమూ, ఆరోగ్యమూ మరికొంత అందమూ, అదృష్టమూ అనుకుంటారందరూ ఉదాత్తత, సౌశీల్యమూ సంగతి ప్రస్తావించేదెవరు.. అల్పసంతోషులెక్కువగా తిరిగే లోకంలో క్షణాలన్నీ కాలక్షేపాల వృత్తాలే అద్భుతాల కోవలోని ఆత్మసౌందర్యపు రహస్యం గుడ్డికన్నుల ముందరి కార్తీక దీపం కొన్ని దైనందిన భావోద్వేగాల అస్తిమత్వమంతే కాగితపు పువ్వుకి తమకమేంటని ప్రశ్నించేవారెందరో 😔

No comments:

Post a Comment