Saturday, 30 January 2021

// నీ కోసం 260 //

సంధి కుదరని సమయమంతా స్వగతాన్ని స్మరిస్తున్నా ఒక్క నవ్వూ తడమలేదు చీకటి పడకుండానే అనామక నిశ్శబ్దం మాత్రం మనసు కిటికీ తెరుచుకునొచ్చేసింది మబ్బుతునకలు రాగమాలిక రాయమని వెంటబడుతున్నా ఒక్క పదమూ ఒలకనంటుంది ఆ వినీలాకాశపు సరిహద్దుల్లో సాయింత్రపు లిపిని నేను ఆరాతీస్తున్న సంగతి నీకు తెలిసుండదు ప్చ్... నీ మౌనానికి కాసిని మాటలొస్తే బాగుండేది నాలో పసిదనం సందడి కోల్పోయేట్టుంది 😒😒

No comments:

Post a Comment