Monday, 28 December 2020

// నీ కోసం 247 //

ఎంత తమకంగా చూసినా తనివితీరని మనసుతీపికి మాటలు సరిపోవెందుకో ఏ రకంగా ఎదురయ్యామో రోజూ కలగానో..కవిత్వంగానో నిన్ను కలుస్తూనే ఉన్నానంటే నా హృదయలాలసను కాదనలేకనే అవును మరి.. గుబురుసంపెంగల తోటలో నా పసిదనాన్ని ముద్దుచేస్తూ నీ మౌనం స్వరమైన ఊహలు నిన్ను తలచుకుంటే తంగేడుపువ్వులా ముట్టుకుంటే ముద్దబంతిలా రోజుకిన్ని పువ్వులుగా మారడం ఆత్మానుగతానికే సాధ్యం కదూ నా కాటుకకళ్ళ గుసగుసలకి బదులిస్తున్న నీ నవ్వులు.. నిన్నొక్కసారి సన్నిధిలో చేర్చగానే ఇన్ని కలవరింతల మాధుర్యాలు ఎన్నెన్ని వలపు మంతనాలని వర్ణించను 💜

No comments:

Post a Comment