Sunday, 27 December 2020

// నీ కోసం 232 //

నేను అన్వేషించిన కాలం నీతో చెలిమి చేయించి నువ్వూ నేనూ ఒకే ఆకాశపందిరిలో ఉన్నామని చెప్పింది కాసేపలా నిన్ను చూసి దాగుడుమూతలాడి నిశ్శబ్దమవ్వాలనుకుంటూనే మౌనంగా నువ్వేదో చెప్పినట్టనిపించి ఊ కొడతాను నవ్వడం ఈరోజుకేం కొత్త కాకున్నా నువ్వనుమతిచ్చిన నా ఇష్టం.. ధ్వనించేంత స్వరమయ్యింది దారితప్పకనే నా ఒడిని ఆశ్రయించిన నీ పాదాలు ఊహలు తొడుక్కున్న పసిపాపలై కొన్ని క్షణాల స్థిమితాన్ని పెనవేసుకుంటాయి కునుకేయడం మరచిన అవిశ్రాంత అనుభూతులు కన్నుల్లో నిన్నంతా నింపేసి రెప్పచాటు రాగాల నివేదనతో వెన్నెల జోలలు పాడుతుంటాయి 💜

No comments:

Post a Comment