Sunday, 27 December 2020

// నీ కోసం 220 //

కన కన రుచి నీ రూపమూ🎵🎵 ఇదేనా మురిపెమంటే.. కంటికెదురుగా ఒక మెరుపు మెరిసి శూన్యమై ఊగిసలాడే గుండెకు వెలుతురు తోరణమై గండుకోయిలకు రూపమొచ్చిన విచిత్ర ఊహ మెదిలింది సుమాల పెదవుల్లోకి మధువెలా నిండిందో క్షణానికో తీరు నీ చూపుల్లో తీపి ఒలుకుతున్నట్టుంది సందెపొద్దులన్నీ సంకెళ్ళు తెంచుకుని రేయయినట్టు ఇప్పుడంతా నా చుట్టూ సహజ పరిమళం మూగింది మనోహరుడన్న మాట తక్కువనిపించే మనోధరుడని ముద్దుగా మురిసిపోతున్నా 😍

No comments:

Post a Comment