Sunday, 27 December 2020

// నీ కోసం 243 //

చాలా పనీపాటా ఉన్న నాకు నువ్వెందుకు వ్యసనమయ్యావో తెలీదు ఎలాగంటావా.. పదేపదే నిన్ను చూస్తూ సగం కాలయాపన పదిసార్లు పొలమార్చుతూ అదో యాతన ఆలోచనల్లో తప్పిపోతూ ఆలాపన తప్పుగా తీస్తున్నా అలౌకికంలో మునిగిపోతూ ఆగమాగం అవుతున్నా అలల్లో తేలిపోయినట్టు కలలోనూ ఈదుతున్నా ఆగి ఆగి అలిగి అలసిపోతూ వేగుతున్నా నువ్వు తిరుగుతున్న ప్రదేశం నా మనసేనంటావా నాకు రంగులేసిన అతిశయం నీ తలపేనంటావా ఏమో.. 🤔 రాతిరంతా కన్నుల్లోకి నిన్ను రాల్చుకుంటూ పగలంతా సోలిపోతున్నా నీతో గడపలేని క్షణాలనూహిస్తూ కొంచెం ధ్యానమౌనంలో మునిగిపోతున్నా 💜

No comments:

Post a Comment