Sunday, 27 December 2020

// నీ కోసం 238 //

నువ్వేంటిలా.. అడిగితే నేనేం చెప్పనూ అప్రమత్తంగా ఉన్న నిన్ను వెతక్కుండానే గుర్తుపట్టి ఈ సమీక్షలేంటంటే ఏ దిక్కుకేసి చూడనూ నమ్ముతావా.. దారిలో ఎదురుపడ్డ గడ్డిపువ్వుని పలకరించి నవ్వాను గానీ కొండలకవతలి పచ్చదనాన్నే పట్టించుకోలేదెప్పుడూ కోయిల స్వరాలు నేర్చి కిలకిలా ధ్వనించాలని సంగీతానికి దగ్గరయ్యా కానీ ఆడంబరానికి పోలేదెన్నడూ అపురూపాన్నని ఆదరించి మనసుపట్టని ఇరుకుదనంలో నన్నుంచిన అంతులేనికధలెన్నో చూసి మదినెంచడమూ మానేసాను గుబులుపుట్టే అక్షరనిక్షేపాలతో నిత్యాన్వేషిలా ఎదురైన నిన్నూ తప్పించుకుపోలేక పట్టుదారప్పోగునై పురివిప్పాను మరీ పరిమళమేంటని ప్రశ్నిస్తే నువ్వొదిలేసిన నిషిద్దాక్షరాలకి చోటిచ్చినందుకు.. నా హృదయంలో వెన్నెలపువ్వులు పూసాయని మాత్రం చెప్పగలను 💜

No comments:

Post a Comment