Sunday, 27 December 2020

// నీ కోసం 214 //

వాలిన రెప్పలు ఎందుకంత తడబడతాయో ప్రేమలో తడిచి ముద్దయ్యే ఇష్టసమాధిలో ఉంటాయో మౌనంలో వరవీణల కొనమీటలు ఆలకిస్తుంటాయో సరే కదాని.. ఉదాసీనంగా తలెత్తి చూస్తే ఎదురుగా అందరిలోనూ నువ్వే వాస్తవంలో కళ్ళు నులుముకున్నా పూల మధ్యలోనూ నువ్వే క్షణానికోలా మారిపోతూ తరంగాలలో, తలపుల్లో నువ్వే ఆవేదనా, ఆనందంలో నువ్వే Gosh...Feel like there's no place for me వెన్నెల ధూపంలో విరజాజుల విరహాలూ ఆకాశపు కనుమల్లో రేయికున్న ఆత్రాలూ.. ప్చ్.. నిర్వికారాన్ని నేర్పాలి హృదయానికి నా చిరునామా నేనే వెతుక్కునేలా చేయొద్దని చెప్పాలి 😒

No comments:

Post a Comment