Sunday, 27 December 2020

// నీ కోసం 239 //

కాసేపు నిన్ను తలవకుంటే మనసు యుద్ధం మొదలెడుతుంది పాడిన స్వరాలు చాలుగానీ మౌనంగా నువ్వనే మాటలు వినాలంటూ నిన్నోసారి పిలవమంటుంది రాతిరంతా నిన్ను అలకలకొదిలేసి అంతర్వేదన కలిగించానని ఊపిరిసలపనివ్వని భాషలో నిందిస్తూ నన్నో పంతం పట్టినట్టు సాధిస్తుంది అస్థిమితంలో నులివెచ్చని పారవశ్యాన్ని పోగొట్టానని రెప్పలమాటు చిరువానలో తడిస్తే తప్పేంలేదని దెప్పుతుంది నువ్వే చెప్పు నీలో అణువణువూ నవ్వుతుండాలని ఆశించే నేను నిజంగా గాయం చేసానా ముద్దుచేసిన కాలాన్నంతా చీకటికిచ్చేసి పరాచికాలాడానా ప్చ్.. మంత్రమేసినట్టు ఒక్కసారి రాత్రైపోతే బాగుండు నువ్వు పంపే పువ్వుల్ని తాకి తెలుసుకోవచ్చు 😂

No comments:

Post a Comment