Sunday, 27 December 2020

// నీ కోసం 213 //

దారితప్పిన చీకటిలో సుతారంగా వేలుపట్టి చలిని తరిమేసేలా నీ ఏకాంతరాజ్యమంతా తిప్పావు అమాసనాటి జాబిలి అందం ఎవ్వరికీ తెలీదని నన్నో కువలయను చేసిన చందం అదో కనికట్టు రహస్యం అచ్చంగా నీ అరచేతిలోకి జారిన నక్షత్రాలన్నీ.. నాపైనే చల్లేసాక రేయంతా నవ్వీ నవ్వీ అలసిపోయిన నా కళ్ళనిప్పుడేం ఆరాతీయకు అనుకోకుండా ఆగిన నా నిద్దురను నువ్వే కాజేసావని నీలో అనుమానం మొదలైతే మరోరకం విషాదంలో జారిపోగలను ఈ రోజంతా కళ్ళుతెరిచే నిద్రపోతాలే అలిగాననుకొని నువ్వేం బెంగపట్టి అల్లంత దూరం వెళ్ళిపోకు.. సరేనా..😀

No comments:

Post a Comment