Sunday, 27 December 2020

// నీ కోసం 218 //

తెలుసా.. కాసిని నీ జ్ఞాపకాలకు కబురుపెట్టి ఏకాంతానికి రంగులేసుంచాను నువ్వు లేనప్పుడు ఏం చేస్తుంటావని అడగవే నీ కోసం మిధున సంగీతపు గమకాలు నేర్చుతున్నానని గుట్టు విప్పాలనుకున్నాను నా పాటవిని చానాళ్ళయిందని చెప్పవే.. నీ తీపినవ్వుల ముగ్ధత్వాన్ని గాలి అలల సౌందర్యంతో పోల్చి చూసాను నా కన్నుల కాటుకల్లోకసలు తొంగిచూడవే నీ హృదయసరోవరంలో తామరపువ్వునై సంతోషాన్ని తొణకాలనుకుంటాను ఒక్క సాయింత్రమూ నన్ను తలచవే నీ తలపులలో తలదాచుకునే నేను కరిగిపోని కలగా కాలాన్నీడుస్తున్నాను ఒక్కసారైనా ఎలా ఉన్నావని పెదవిప్పవే అన్నీ తెలుసని నీకు నువ్వుగా అనుకుంటావెలా పదమంటూ నాతో చరణమే కలపనిదే 😒😔

No comments:

Post a Comment