Sunday, 27 December 2020

// నీ కోసం 241 //

నన్ను నేను ప్రేమించుకోవాలనుకున్న ప్రతిసారీ నువ్వు.. నువ్వు.. ఇంకో నువ్వు.. ఆహ్వానమందుకున్నట్టు అంతరంగంలోకొస్తావు తీయని కన్నీళ్ళలో కలలు కనిబెట్టి మానసికాభిమానాన్ని నిశ్శబ్ద సంగీతం చేస్తావు అంతర్ముఖం కాబోయే నేను మనోమందిరంలో వినిపిస్తున్న మధురధ్వనికి ప్రతిస్పందిస్తూ ఎక్కడా వాక్యం విరక్కుండా ఊహకందని ఆనందపుతోరణాలు కడతాను నీ సహజ ఔన్నత్యంలోని శాంతిని అనుభవిస్తూ నాలో అనురాగాన్ని కవిత్వం చేసి మళ్ళీ మళ్ళీ నన్ను కోల్పోతాను నాలో అద్భుతమంతా నీకిచ్చేసి అలజడి మాత్రం మిగుల్చుకుని అక్కడెక్కడో నీ అదృశ్య ఆదరణ కలుపుకుని నాకు నేను మిగులుతానో లేదోనని కలవరమవుతాను 🤷

No comments:

Post a Comment