Sunday, 27 December 2020

// నీ కోసం 236 //

నిదురంటని రాత్రిని సవరించేందుకు అరమోడ్పులైన కన్నుల్లో అద్భుత దృశ్య కళాఖండం ఊహకందని నీ కదలికల ప్రతిధ్వని ఊపిరాడనివ్వని మధురసంగీతమై నా భావదేహాన్ని కంపిస్తున్నది తెలుసా అవును... ఆ పట్టంచువారగా మెరుస్తున్న పసిడిపాదాలు నా హృదయాచలాన మునివేళ్ళతో అడుగులేస్తున్న సమ్మోహన సవ్వళ్ళు అసలే సరిహద్దుల్లోంచీ నువ్వొస్తావో ఎన్ని నక్షత్రాలని గుప్పిళ్ళతో తీసుకొస్తావో ఎన్నేసి పువ్వుల తడివెన్నెల రంగులేస్తావోనని రెప్పలనాపి ఎదురుచూస్తున్నా నిన్ను ఆహ్వానించేందుకని..💜😂

No comments:

Post a Comment