Sunday, 27 December 2020

// నీ కోసం 223 //

నీ మౌనానికి మాటలొస్తే ఆనందభైరవిలా ఉంటుందో.. మోహనరాగ ఛాయలో ఉంటుందో పరువపు చిలిపిదనంలో హృదయపు ప్రేమతనం కలిసుంటుందో.. నీ పెదాల తీపినంటిన పదాలు లాలనంతా కలగలిసిన ఆర్తిగానో పెద్దరికం ముసుగేసిన గాంభీర్యంగా ఉంటాయో మురళీ నాదంలా మధురంగానో గువ్వల సవ్వడిలా గలగలమంటాయో కలల్లో ఓదార్పుగా ఉండే నీ గొంతు మన గణేశుడి గుడిగంట చప్పుడులానో ఆ సముద్రపు అలల ప్రవాహంలా ఉంటుందో కొమ్మల్లో రెపరెపలాడే చిరుగాలిలానో గుండెల్లో గుసగుసలాడే కావ్యంలా ఉంటుందో నీ మురిపెమైన ముచ్చట్ల కోసం ఏకాంతపు కిటికీ తెరిచుంచుతా కాలాలు దాటి త్వరగా నువ్వొస్తే అనంతరాగాలు హిందోళం చేసేద్దాం 💜😂

No comments:

Post a Comment