Sunday, 27 December 2020

// నీ కోసం 227 //

నువ్వెందుకలా.. మనసు వెంటబడి మరో ధ్యాస లేకుండా చేస్తావ్ అందరిలా ఉండకుండా.. అసలు నాలోకి ఎలా వచ్చావ్ నన్నెప్పుడైనా వెతికి ఉంటావా జన్మాంతరాల తర్వాత తడుముకున్న అనుభూతిలో నా శ్వాసను ఊదా రంగుపూలలో పోల్చుకున్నావా నీ కోసం ఎదురుచూసిన గుర్తులేదు కల్లోకి రమ్మని పిలిచింది లేదు అప్పుడెప్పుడో అలల్లో తప్పిపోయి నా అక్షరాల్లోకొచ్చి తేలావా ఒక్క చిన్న పలకరింపుతోనే నాతో నిన్నంతా పాడించుకుంటావ్ మరొక్కసారిలా తడిమేలోపునే నన్నొదిలేసి నీరవమవుతావ్ ఏ చప్పుడయినా ఉలికిపడుతున్నా వచ్చినట్టే వచ్చి మొహమాటంగా వెళ్ళిపోతావేమోని 😔

No comments:

Post a Comment