Sunday, 27 December 2020

// నీ కోసం 237 //

నీలో విరహాన్ని తీర్చేందుకు
నిన్ననుసరిస్తూ నే వేసిన నాలుగడుగులు నువ్వు వెనక్కి తిరిగుంటే తెలిసేవి నా ఏకాంతం నిన్ను వెతికినట్టు నీ నిశ్శబ్దం నన్ను తలవదని తెలుసుకున్న క్షణాల గాయమిది అరచేతుల ఆలింగనాలకే హద్దులున్నప్పుడు జ్ఞాపకాల పరిమళపు ముడివిప్పి ఎంత విషాదాన్నని లెక్కించను ఊపిరాడనివ్వని నీ మౌనానికి నా మనసు ఒరుసుకొని కొంత సవ్వడి హేమంతపు వెన్నెలై రాలుతుంది కలల్ని పారేసుకోవద్దని నీకేం చెప్పను నీ పొడిచూపుల్లో ఏ భావమూ పలకనప్పుడు 😔

No comments:

Post a Comment