Sunday, 27 December 2020

// నీ కోసం 233 //

నిస్సారంగా కదులుతున్న నా క్షణాలకి పదిలంగా దాచుకోవలసిన ఆకర్షణుంటుందని పరవశాన్నివ్వాలనుకున్న నీ చూపుల రహస్యమదేనా నీ ఆనందానికి నా మనసు రెపరెపలాడి కూడా మౌనానికి కొత్త అర్ధాన్నిచ్చేలా మల్లెపొదల్లో మాటలు దాచుకున్నది తెలిసిపోయిందా కనురెప్పలు దాటితే కలలగుట్టు తెలిసిపోతుందని మోహనరాగం మైమరపుగా మారి పెదవుల్లో తళుక్కుమన్నది నిజమేనా ఆ నవ్వులవే కదా నువ్వూ నేనూ కూడబలుక్కుని కాలాన్ని మాయచేసి శీతాకాలాన్ని వెచ్చబెట్టుకున్నవి Hmm.. ఫర్వాలేదు.. మితిమీరి ప్రవహించే భావాల సన్నని పరిమళం ఊపిరికి మాత్రమే సొంతం చేస్తాలే..😂

No comments:

Post a Comment