దగ్గరతనమంటే.. సాన్నిధ్యమేనా
కళ్ళతో చూస్తూ మనసు వెచ్చబడిపోవడమే కదా
ఉదాత్తమైన నీ ఊహకో అద్భుతమున్నందుకే
సౌందర్యమూ, లాలస లేని నా దేహానికి ఆకర్షణంటిందా
మౌనంగా ఉంటూనే నీ హృదయవలయం దాటి
నన్ను సృజించావంటే.. బహుశా అది ఆత్మతో ఏకత్వమా..
మనోవ్యథను మోయలేని రాతిరి
నీ తలపుల్లో సేదతీరడమే ఊరటైతే
నా స్వప్నంలో మెరిసే భాష్పానివి నువ్వేనా
నేనూ నాది అనుకున్నదంతా
నువ్వేనన్న రహస్యమిప్పుడిప్పుడే తెలుస్తుంది మరి
No comments:
Post a Comment