Wednesday, 13 July 2022
// నీ కోసం 467 //
మనసు గదిలోకొచ్చి నువ్వు చేసిన గారాబానికి
నాలో చిరునవ్వుల సద్దు మొదలవ్వగానే
నిశ్శబ్దం ఎటో వెళ్ళిపోయింది
తెలుసా..
కాలం రహస్యంగా నిన్ను దాచేసి
నన్ను జ్ఞాపకాల చీకటికొదిలేసి
సుతారం నటిస్తూ కదిలిపోతుందనుకున్నా
మలయ సమీరంలా అదృశ్యంగా
నేను చెప్పలేని మాటలన్నీ నువ్వే వినేసి
తెగని వాక్యమొకటి వినిపించగానే
నీ సాంత్వన.. నదిలోని అలలా అల్లుకుంది
ఆస్వాదించేందుకు అనుభూతుల్లేవని
పొగిలి పొగిలి ఒత్తిగిల్లిన హృదయం
ఒక్కసారిగా ఊయలూగిన సమయం
ఆనందం అంతర్వేదిలా నన్నంతా తడిపేసింది
Infact.. I never afford even to smile before
N now that u touched my raw emotions
I can't stop laughing out loud
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment