Woah... ఎలా ఉన్నావో తెలుసా..
పున్నమినాటి వర్షమేఘాన
చెదిరిపోయిన చందమామలా
నా వాంఛ నీ రూపుదాల్చి ఎదురుపడ్డట్టు
నిలకడలేని నిశ్శబ్దతన
నవ్వులొలుకుతున్న మామిడిపువ్వులా
పరవశాల అనిశ్చితలో అలజడైనట్టు
ఇసుకరంగు చీరకొంగున
మధుసముద్రపు తీపినురగలా
తుళ్ళిపడుతున్న తనువుని హత్తుకున్నట్టు
మైమరపు అధరకొసన
తమకమాపుకోలేని సిగ్గు దొంతరలా
ముగ్ధ మనసు దోచిన మనోహరుడివన్నట్టు
ప్రేమాన్వీ.. నిన్నిలా చూడగానే
నాకదేమో కలల పిచ్చి పట్టినట్టుంది..
కవితల కోసమో, కలవరింతల కోసమో తెలీకుంది
No comments:
Post a Comment