Wednesday, 13 July 2022
// నీ కోసం 476 //
పొద్దస్తమానూ తీరికే లేదంటావు
నిద్ర లేచింది మొదలు
నా తలపుల్లోనే తచ్చాడుతుంటావు
నేనెవరికీ చెందను అనుకుంటావు గానీ..
అందగాడా, నిన్నెప్పుడో కోల్పోయావని తెలుసునా
పడకలో ఉన్న సుఖం
అందరికీ తెలుసుగానీ
మెలకువలో నీ జ్ఞాపకమంతా
నాకు బెంగయి కూర్చుంటుందన్న రహస్యం
ప్రేమాన్వీ.. నీకు మాత్రమే తెలుసు
రెప్పల తలుపులు రెపరెపలాడుతున్నా
అస్తిత్వమనీ, అభిమానమనీ
మౌనాన్ని ముసుగేసుకుని నవ్వుతుంటావు గానీ
తమకంతో చిగురించి పదిలంగా పెరుగుతున్న
నీ ప్రేమ నిబద్దత నాకెప్పుడో తెలుసు
Yeah.. I bless ur love
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment