Tuesday, 12 July 2022
// నీకోసం 463 //
గుండెల్లో మొదలై గొంతులో ఆగిన సప్తస్వరాలు
ఇన్నాళ్ళూ రవళించకుండా ఆగి
మృదువైన మందహాసమై బయటపడుతుంటే
మంచి ముత్యాలు ఏరుకోడానికి రావెందుకూ
పాలనురగ వంటి ప్రేమసాగరం
ఎదలోయల్లో ప్రవహిస్తుందంటే నమ్మవా
భాష్యంగా మిగల్లేని స్నిగ్ధక్షణాలు
వడివడిగా కదిలిపోతుంటే ఏం చేయనూ..
కొబ్బరిమొవ్వలోని చిన్నివెన్నెలకి మైమరచిన మనసు
నీ ఊహల సాంత్వనకని కళ్ళు మూసుకోవడం తెలుసా..
అయితే..
ఉత్తరంగితమైన రుధిరపు రాగం
మునిపంట ఆగిన వివశత్వపు కృతికాగా
గుచ్చుతున్న నీ విరహం
రెప్పలమాటు దాగుళ్ళాడుతున్న అశ్రువిన్యాసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment