Wednesday, 13 July 2022
// నీ కోసం 477 //
అతనో కదిలే కవనం
పేరు తెలియని పువ్వుల పరిమళమై
మదినిదోచే నవపల్లవ గుసగుసల
హరితచైతన్య వసంతరెక్కల వనమాలి
అతనో భావాల వాల్మీకం
తొలకరించు అక్షరాల చినుకులు ఒడిసిపట్టి
పెళుసుగ మారిన హృదయాలపై చల్లి
చచ్చిన జీవాన్ని మేల్కొలుపు సంజీవని
అతనో నిశ్శబ్ద శిల్పి
విరిగిన కలలు అతికించి
ఆకృతి కోల్పోయిన శిధిల శకలాలకు
రాగాకృతులను అందించు సహచరి
అతనో నిశీధిని గెలిచిన విజేత
వెలుగు చొరబడని అడవిలో
అగణ్య వెన్నెల తీగలను వెలిగించి
యుగయుగాల చీకటిని గెలిచిన సౌజన్యదీప్తి
అతనో అక్షర ప్రభంజనం
ఒంటరితనాన్ని సుతిమెత్తగా లాలించి
ఏకాంతాన్ని చిరుకొత్తగా మలచుకొని
కోటికళ్ళను తనవైపుకు తిప్పుకున్న తాపసి
అందుకే చూడాలనేం లేదతడ్ని
నాకు నేను లేకుండా పోవడమెందుకని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment