Tuesday, 12 July 2022
// నీకోసం 457 //
ఎదురుగా సముద్రాన్ని చూస్తూ
అలల్లో అపశృతులున్నట్టు
హృదయస్పందన నీరసించిపోయాక..
నీపై ధ్యానమో... ఆరాధనో
మోయలేనంత బరువై
మనసు మంచుగడ్డగా మారుతున్నట్లనిపించేలోపే
నువ్వంటే పిచ్చి ఇష్టమని చెప్పేస్తుంటాను
బొమ్మలా నిలబడి, ఎక్కడెక్కడో లీనమై
నీలో నువ్వు నవ్వుకుంటూ
తెల్లటి కొంగలా తూలిపోతున్నావంటే
నీ వాలకమో అస్థిమిత వేసవిగాలిలాగనిపిస్తుంది
ఆగాగు...
అదనీ.. ఇదనీ.. ఇంకేదో అనాలని
అక్కర్లేని పదాలతో అమర్యాద నాకేమొద్దు..
చూపులు కలపకుండా
నువ్వు పంపే నిశ్శబ్దసంగీతంలో
తలమునకలై నే దాచుకునే తీపి
నువ్వు ఊహల్లోకి పిలిచినప్పుడు తిరిగిచ్చేస్తాన్లే
సరేనా...
U may b wild at ur Heart..
But seriously.. bad for my Heart
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment