అమాస రోజుల్లో మంచుతెరలు దాటి
మసకచీకట్లో చందమామ
కనిపించిందని చెప్పావంటే
నీ మనసాకాశంలో
అస్తమించని దీపం నేనేనని తెలిసింది
కానీ.. తెలుసా..
నీ మౌనం పెట్టిన మంటకి
నాలో అక్షరప్రవాహమే ఆగిపోయింది
ఏకాంత నిర్వచనమో
అంతర్వేదనగా మారి చీకటినల్లుకుంది
నీ దీర్ఘశ్వాసల శరవేగం నన్నంటక
నా నవ్వు ముఖమే చిన్నబోయింది
నిన్ను స్మరించిన రాత్రులన్నిటా
నిద్దుర కరువై నిట్టూర్పులమయమయ్యింది
అయితే ముద్దు ముద్దుపేర్లతో పిలిచే
నీ ప్రేమ గుర్తుకొస్తే మాత్రం
నా తనువంతా పరిమళాలపొగ చిమ్ముతుంది
No comments:
Post a Comment