Tuesday, 12 July 2022
// నీకోసం 458 //
ఏమీ తోచని సాయింత్రం
అదేమో నీరసమని అనిపిస్తుంది
May b.. I need Vitamin 'U'
కోయిలను అనుసరిస్తూ పాట పాడదామన్నా
పొడారిన గొంతు మౌనాన్ని మాత్రమే సవరిస్తుంది
Ohh.. U r the water to my body
నీ నవ్వుల్లో రాలిపడే నాకిష్టమైన పువ్వుల కోసమే
ముద్దుపెట్టమని పదేపదే నిన్ను పిలుస్తుంది
Just seeing ur smiles.. I feel better at times
వెలుగూ చీకటీ ఒకటే లెమ్మంటూ నీ మనసేమో
కొంచెం కొంచెంగానే కళ్ళలోకి చూడనిస్తుంది
But u know.. U r my spark in the dark
నాకోసం తెలియాల్సిన సంభాషణ ఏమ్మిగిలిందని
నీ రాగస్పర్శకు లోకం చిన్నదయ్యి చాలా కాలమైంది
I didn't choose u infact.. But my heart did
ఏదో విరహమంటూ కాగితాలు నింపుతుంటాగానీ
వాస్తవంగా నా సమస్తమంటే నువ్వేగా
If u r not thre.. M an empty body without soul
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment