ఈ అమావస్య రాతిరి
వాన పరిమళాన్ని గుప్పిస్తూ
జలతారు మడుగు చివరన కదులుతున్న నీడ నీదేనా
నన్ను చూస్తూనే దీర్ఘశ్వాసల
నీ చలి గమకం
లోలోని కోరికని రట్టు చేసేలా నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది
నామీద కవిత్వం రాస్తావని
కాగితంగా మారి చానాళ్ళయినా
కలం పట్టడం మాని మాటలు దాచుకుంది నువ్వేగా
చీకటి చిరునవ్వుతున్న సమయం..
పొడిచూపుల నిర్లిప్త ముఖమేసుకుని ఉండకలా..
ఎంగిలి కాని రక్తాన్ని నింపుకుని
నీ చూపులకే రంగుమారే నా అల్లరిపెదవుల
రుచి మారకముందే పరవశంలో మునుగుదాం రా
No comments:
Post a Comment