Tuesday, 12 July 2022
// నీకోసం 454 //
Life is made real, becoz we experience it..
అవును..
నాదసలే చిన్న ప్రపంచం
ప్రభాతాలు, పువ్వులూ, పాటలూ
ఋతువులూ, రంగులూ, రాగాలూ
మబ్బులూ, ముద్దులూ, మధురోహలు
ఇవేగా నాకిష్టం
మరేమో
వాటన్నిటికన్నా నువ్విష్టం
ప్రేమవర్షం కురుస్తూ మిలమిల మెరిసే
ఆ తడి కళ్ళిష్టం
నిశ్శబ్దంలో ఊగుతూ మౌనాన్ని లిఖించే
నీ పదములంటే ఇష్టం
ఆకుచాటు కనపడకుండా పరిమళించే పువ్వులా
నా హృదయస్థలాన నీ ఉనికిష్టం
దిగులు మోహమిది నాకు మాములేనని తెలిసీ
లోలోపల నువ్విక్కిరిబిక్కిరవుతూ కూడా
నువ్వంటే ఎంతిష్టమని ఎన్నిసార్లని అడుగుతావ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment