Tuesday, 12 July 2022
// నీకోసం 452 //
Heyy.. Ther r a lot of things that can
give u butterflies 😍
ఎప్పుడైనా ఈ దారి వెంట నడుస్తున్నప్పుడు,
నా హృదయమంతా ఓ పూల సుగంధమన్న రహస్యం, ప్రేమపక్షాన ఉండే నువ్వు గమనించావా
నా అరచేతిలోని ప్రపంచానికి స్వస్తిచెప్పి ఏకాంతానికి రంగులద్దే సమయమంతా బృందావనమై విరబూసి వెన్నెల్లో తడుస్తూ పులకరించే మల్లెలంత పొగరవుతుంది తెలుసా
సంధ్యాస్తమాన సరాగ హేలలు, ఊహల మకుటానికి నారింజ కాంతులుగా నా మనో నీలాన్ని ఆవరించడం చూస్తావా...
అప్పుడైతే నీ మనసునల్లుకున్న ఆకుపచ్చని దృశ్యకావ్యంలో సగం మౌనాన్ని రాల్చేలా ఎదురుగా కళ్ళతో నవ్వుతున్న నేను పువ్వుల్ని బుగ్గలకు రాసుకుంటున్నట్టు భావించు..
అయినా... ఖాళీసమయమంటూ దొరికేదేముంది. నీలో నువ్వు మెత్తగా ఊగుతున్నావంటే నాతో కలిసి గమ్మత్తుగా పైకెగురుతున్నట్టేగా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment