నీ అడుగులు అలికిడయ్యే వరకూ
కళ్ళు తెరవద్దని ఇంతసేపూ
నిద్ర నటించానా..
ఉదయం సాయింత్రమయ్యే వరకూ
నీ ఉనికిలేక ఉలిక్కిపడి
లేచి కూర్చున్నా..
నీకోసం దిగులుపడతానో లేదో
తెలుసుకోవాలనుకునే ఆ సరదా
ఏంటో తెలీదు..
ఆ తర్వాత.. నేనేదో అలిగానని
అడిగిన పిట్టకీ, అడగని పువ్వుకీ
ఏదేదో చెప్తావెందుకో అస్సలే తెలీదు..😏
సరేలే..
As u suddenly spring up from nowhere..
Let's pretend that everything s fine..
N I'll excuse u as always..
No comments:
Post a Comment