అవును..
కొన్ని ఋతువులు.. ప్రేమమయం అనిపిస్తాయినిన్నూ నన్నూ కలిపిన స్వర్గాలనిపిస్తాయి
పగలు సీతాకోకలై.. రాతిరి మిణుగురు పువ్వులై
అనేక రూపాల్లో కదులుతుంటాయి..
ఇరుసంధ్యల్లోని సౌందర్యం
మనసు కవనానికి మకుటంగా
చిరునవ్వు స్వగతాలను లిఖించమంటాయి
కొన్ని పదాలు
కొన్ని రాగాలూ
కలిసి కృతులై పల్లవిస్తాయి
కొన్ని అనుభూతులు
మరిన్ని గమకాలై
రసలిప్తలు పాడుతుంటాయి
నింగీనేలకులేని దూరాభారాలు మనకెందుకంటాయి
ఏకాత్మగా మోస్తున్న హాయిని దాచుకోమంటాయి
No comments:
Post a Comment