Sunday, 28 March 2021

// నీ కోసం 282 //

 Heyy..నా కళ్ళతో చూడు..

నిద్రలో కలలు కంటూ నవ్వుతున్నట్టు
అంత మురిపెమెందుకు నీ మోములో

ఆఘమేఘాల చలిపొద్దు
శీతాకాలాన్ని విన్నవించి వెచ్చబడినట్టు
గులాబీల వన్నెలెన్నో ఆ బుగ్గల్లో

ఎవరో లాలిపాడుతూ
బజ్జోమని నిన్ను నిమిరినట్టు
పసిదనమేంటో నీ మెత్తని చూపులో

లోలోపలేదో కలవరిస్తూ
గొంతు విప్పడం మరచినట్టా పెదవి
నన్ను పలకరించమని ఎన్నిసార్లు చెప్పాలో

తరచితరచి ఆలకిస్తున్నా
నీ రెప్పల బరువులో రాగాలు
గారాలుపోతున్న కోయిల కూజితాలనో

ఓయ్.. కాసేపలా లీనమవాలనుంది..
మనసువారగా మురిసిపోతూ
ఎన్ని భావాలు పోగేసావో నాకూ చెప్పవూ 

No comments:

Post a Comment